ద్యుతికి పసిడి పతకం

పాటియాల : భారత్​ గ్రాండ్​ప్రి-2లో స్టార్​ అథ్లెట్​ ద్యుతీచంద్​ పసిడి పతకం సాధించింది. గురువారం జరిగిన మహిళల 100 మీటర్ల రేసులో బరిలోకి దిగిన ద్యుతి 11.44 సెకన్లలో మొదటి స్థానంలో నిలిచింది. ప్రత్యర్థులకు దీటైన పోటీనిచ్చిన ఈ ఓడిశా అథ్లెట్​ గతం(11.51 సె) తో పోల్చుకుంటే తన సమయాన్ని మరింత ఇంప్రూవ్​ చేసుకుంది. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించడమే లక్ష్యంగా ముందుకు పోతున్న ద్యుతి ఆదిశగా రేసు రేసుకు తన క్రీడా ప్రతిభను మెరుగుపరుచుకుంటున్నది. ప్రజెంట్​ ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్​ దగ్గర శిక్షణ తీసుకుంటున్న ద్యుతి ఒలింపిక్స్​ అర్హత మార్క్(11.15సె) అందుకునేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తున్నది. మరోవైపు దాదాపు సంవత్సరం తర్వాత రేస్​లో అడుగుపెట్టిన ఇండియన్​ యువ స్ప్రింటర్​ హిమదాస్​ సత్తాచాటింది. మహిళల 200 మీటర్ల పరుగులో 23.31 సెకన్లలో గమ్యాన్ని చేరి స్వర్ణపతకం దక్కించుకుంది. గాయం కారణంగా 2018లో ఆసియా క్రీడల తర్వాత పరుగుకు దూరమైన హిమ చివరగా 2019 ఆగస్టులో ఓ టోర్నీలో పాల్గొంది. టోక్యో ఒలింపిక్స్ లో అర్హత పొందడమే లక్ష్యంగా పోరాడుతున్నది.

ads