ఎంసెట్ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగింపు

హైదరాబాద్ : ఎంసెట్  (Eamcet) ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును ఉన్నత విద్యాశాఖ మరోసారి పొడిగించింది. ఆలస్య రుసుము లేకుండా ఈనెల 17 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఎంసెట్‌ కన్వీనర్ వెల్లడించారు. ఎంసెట్‌కు ఇప్పటివరకు 2లక్షల20వేల27 దరఖాస్తులు వచ్చాయని కన్వీనర్ గోవర్దన్ వివరించారు. ఎంసెట్ (Eamcet)ఇంజినీరింగ్‌కు లక్షా 46వేల 541, అగ్రికల్చర్‌కు 73వేల486 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

ads