పీఆర్సీ ప్రకటనకు ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్ ‌: తెలంగాణలోని ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ ప్రకటించేందుకు మార్గం సుగమమైంది. పీఆర్సీ ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో పీఆర్సీ ప్రకటనపై రాష్ట్ర ఆర్థికశాఖ ఈసీ అనుమతిprc కోరింది. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం…పీఆర్సీ ప్రకటనకు ఎలాంటి ఇబ్బందీ లేదని తెలిపింది. అయితే అనవసర ప్రచారం చేయరాదని, ఎలాంటి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించకూడదని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అవినాష్‌ కుమార్‌ లేఖ రాశారు.

ads