ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఇంట్లో ఈడీ సోదాలు

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. రూ.1064 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ చేసినట్లుగా అభియోగాలు రావడంతో నామా ఇంట్లో ఈడీ శుక్రవారం తనిఖీలు చేపట్టింది. జూబ్లీహిల్స్ లో నామా నాగేశ్వర్ రావు సమక్షంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఖమ్మం, హైదరాబాద్ తో పాటు ఆరు చోట్ల ఈడీ సోదాలు చేస్తోంది. మధుకాన్ కంపెనీతో పాటు రాంచీ ప్రాజెక్టుకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నామా నివాసంలో పెద్ద ఎత్తున నగదు గుర్తించినట్లు సమాచారం. అక్రమంగా నిధులు మళ్లించారని మనీ ల్యాండరింగ్ యాక్ట్ కేసు నమోదు కాగా, నామా నివాసంలో పెద్ద ఎత్తున నగదు గుర్తించినట్లు సమాచారం.

ads

లోన్ల రూపంలో తీసుకుని విదేశీ కంపెనీలకు ఆ డబ్బు మళ్లించారని నామాపై ఆరోపణలు వచ్చాయి. నామాతో పాటు రాంచీ ఎక్స్ ప్రెస్ వే సీఎండీ కె. శ్రీనివాస్, కంపెనీ డైరెక్టర్లు సీతయ్య, పృథ్వీ తేజ నివాసాల్లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. కాగా 2019 లో నామాపై కేసు నమోదు సీబీఐ 2020లో ఆయనపై చార్జీషీట్ ఫైల్ దాఖలు చేసింది. దీంతో పాటు సీబీఐ మధుకాన్ ఇన్ఫ్రా, మాదుకాన్ ప్రాకెక్ట్ , మదుకాన్ టోల్ వే, ఆడిటర్లను చార్జీషీట్లో నిందితులుగా చేర్చింది.