5 నుంచి ఎడ్‎సెట్ కౌన్సిలింగ్

హైదరాబాద్: బీఎడ్ కోర్సులో ప్రవేశాల కోసం చివరి దశ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 5 నుంచి 10వ తేదీ వరకు విద్యార్థులు ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఆయా తేదీల్లోనే విద్యార్థులు ఆన్ లైన్ లో ఫీజు చెల్లించాలని , సర్టిఫికెట్ల కాపీలను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని సూచించారు. రిజిస్టర్ చేసుకున్న వారి జాబితాను ఫిబ్రవరి 11న ప్రకటిస్తామని వెల్లడించారు.

విద్యార్థులు 12, 13 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, 14వ తేదీన ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చన్నారు. సీట్లు పొందిన విద్యార్థుల జాబితాను ఈనెల 17న ప్రకటిస్తామని తెలిపారు.