రాష్ట్రంలో విద్యాప్రమాణాలు క్షీణించాయి

వరంగల్​ అర్బన్​ జిల్లా : తెలంగాణ ఏర్పడ్డాక విద్యాప్రమాణాలు రోజు రోజుకు క్షీణించాయని మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కి గౌడ్ అన్నారు. మంగళవారం వరంగల్ అర్బన్​ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎన్​ఎస్​యూఐ కార్యకర్తల సమావేశం వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లకొండ సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కి గౌడ్, వరంగల్ అర్బన్ ,రూరల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, రాష్ట్ర ఎన్​ఎస్​యూఐ ఇన్​చార్జి నవీద్ ఖాన్, ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ హాజరయ్యారు.

‘ నేటి విద్యార్థులే రేపటి భావి పౌరులు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం , అటు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని చెప్పి విద్యార్థులను మోసం చేశాయని విమర్శించారు మధుయాష్కి. అపరిష్కృత విద్యార్థుల సమస్యలపై పోరాడటానికి ఎన్​ఎస్​యూఐకి పలు సూచనలు చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 2 లక్షల 90 వేల ఉద్యోగాలు ఉన్నాయని అన్నారు. అప్పటి నుంచి ఏ ఒక్కరికి ఉద్యోగాల నోటిఫికేషన్ లు ఇవ్వలేదన్నారు. రిటైర్మెంట్ అయిన వారితో కలిపితే 3 లక్షల చిల్లర ఉద్యోగాలు ఉంటాయని పేర్కొన్నారు మధుయాష్కి. తన అవినీతిని కాపాడుకోవటానికే అటు మోడీ, అమిత్ షా మోకాళ్ల మీద సీఎం కేసీఆర్​ పడ్డారని విమర్శించారు.

తన స్వంత ప్రయోజనాల కోసం ఖాళీగా ఉన్న ప్రైవేటు కోచింగ్ సెంటర్లో ఉద్యోగాలు భర్తీ చేశాడు కేటీఆర్​ అని ఆరోపించారు మధుయాష్కి. అవినీతిలో తండ్రిని మించిన తనయుడు. కేటీఆర్​ కాదు కేడీఆర్​ అని ఎద్దేవా చేశారు.

ప్రధాని మోడీ ఇస్తానన్న రెండున్నర లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చినాడ ? అని మధుయాష్కి ప్రశ్నించారు. ఇవాళ భారత దేశంలో 12 వేల కోట్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో 10 లక్షలు మంది రిజిస్టర్ చేసుకున్న నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగ కల్పన దేవుడు ఎరుగు నిరుద్యోగ భ్రుతి కూడా లేదు అని మాజీ ఎంపీ మధుయాష్కి మండి పడ్డారు.

విద్యా సంవత్సరం ఆఖరిలో స్కూళ్లు కాలేజీలు మొదలు పెడుతున్నారు. ఎందుకంటే ఫీజులు వసూలు చేయాలని ఆలోచనతోనే అన్నారు. ప్రైవేటు సంస్థలకు లాభం చేకూరే విధంగా కేసీఆర్​ వ్యవహరిస్తున్నాడన్నారు. ముక్కు పిండి ఫీజులు వసూలు చేసి ప్రజలను దోచుకుంటున్నాడని ఆరోపించారు మధుయాష్కి. కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైంది ? పెండింగులో ఉన్న అన్ని ఫీజు రీ యింబర్స్ మెంట్ మరియు స్కాలర్ షిప్ వెంటనే విడుదల చేయాలి అని మధుయాష్కికోరారు. విశ్వ విద్యాలయాలకు వెంటనే వీసీలను నియమించాలి, ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలి. కరోనా టైంలో స్కూల్ & కాలేజీల ఫీజు 50 శాతం మాఫీ చేయాలి అని మధుయాష్కీ డిమాండ్​ చేశారు. నౌకరి దో యా డిగ్రీ వాపస్​లో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్​ఎస్​యూఐ కార్యకర్తలు, కాంగ్రెస్​ పార్టీ నాయకులు పాల్గొన్నారు.