మావటిని కడసారి చూసేందుకు వచ్చిన గజరాజు

కేరళ : కొన్ని జంతువులు, మనుషుల మధ్య అనుబంధం విడదీయలేనిది. ఆ మూగ జీవాలు చూపించే ప్రేమ అమూల్యం. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. చనిపోయిన తన మావటిని కడసారి చూసేందుకు గజరాజు తరలివచ్చిన ఆ సన్నివేశం పలువురి గుండెల్ని పిండేశాయి. విగతజీవుడిలా పడివున్న ఆ మావటిని పిలుస్తున్నట్టుగా తొండం పైకెత్తి పలుమార్లు ఆ ఏనుగు ప్రదర్శించిన హావభావాలు ప్రతీ ఒక్కరినీ కదిలిస్తున్నాయి. ఆ మావటి కుటుంబ సభ్యుడు ఏనుగును చూసి కన్నీటిపర్యంతమయ్యాడంటే ఆ కుటుంబానికి, ఏనుగుకు మధ్య ఎంత ఆత్మీయత ఉందో అర్థమవుతుంది.

ads

ఈ ఘటన కేరళలోని కొట్టాయంలో చోటుచేసుకుంది. ఆ మావటి పేరు కున్నక్కడ్ దామోదరన్ నాయర్. 74 ఏళ్ల నాయర్ ను స్థానికులు ఓమన్ చెట్టన్ అని పిలుస్తుంటారు. ఆయన గత 6 దశాబ్దాలుగా ఏనుగుల సంరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా ఏనుగు పేరు పాల్ఘాట్ బ్రహ్మదత్తన్. ఓమన్ చెట్టన్ కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతూ కన్నుమూశాడు.