కెమెరాకు చూపించి లంచం తీసుకుంది

శ్రీకాకుళం జిల్లా : అధికారులు ఒకటికి రెండు సార్లు ఎవరూ చూడట్లేదని నిర్ణయించుకున్నాకే లంచాలు తీసుకుంటారు. కానీ శ్రీకాకుళం జిల్లాలో ఓ అధికారి మాత్రం సీసీ కెమెరాకు చూపించి మరీ లంచం తీసుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.
జిల్లాలో కర్మాగారాలశాఖ తనిఖీ కార్యాలయంలో ఓ అధికారిణిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అందుకు కారణం ఆమె సీసీ కెమెరాకు చూపించి మరీ లంచం తీసుకోవడమే. కార్యాలయంలో బీ కుసుమ కుమారి 18 సంవత్సరాలుగా సీనియర్ అసిస్టెంట్​గా పనిచేస్తున్నారు. ఆమె మొదటి నుంచి బాధ్యతారాహిత్యంగా పని చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఆమె పని తీరుపై నిఘా పెట్టడానికి అధికారులు సీసీ కెమెరాలు పెట్టించినట్లు తెలిసింది. ఇటీవల ఆమె భయపడకుండా సీసీ కెమెరాకు చూపించి మరీ లంచం తీసుకుంది. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్​ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఆమెను సస్పెండ్ చేసినట్లు కర్మాగారాల శాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ శర్మ మీడియాకు తెలిపారు.