ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోలు మృతి

ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోలు మృతి

మారేడువిల్లి అడవుల్లో ఎన్ కౌంటర్..మావోయిస్టు అగ్రనేత గణేష్ మృతివరంగల్ టైమ్స్, అల్లూరి సీతారామరాజు జిల్లా : మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం తెల్లవారుజామున భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో సెంట్రల్ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్, అలియాస్ ఉదయ్, జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ ఉన్నారు.

గాజర్ల రవి స్వగ్రామం భూపాలపల్లి జిల్లా వెలిశాల గ్రామం. గణేష్ సోదరులు ఆజాద్, అశోక్ లు మావోయిస్టు పార్టీలో పనిచేశారు. గతంలో జరిగిన ఎన్ కౌంటర్ ఆజాద్ మృతి చెందారు. మరో సోదరుడు అశోక్ కొంత కాలం క్రితం పోలీసుల ముందు సరెండర్ అయ్యారు.

మరో మావోయిస్లు అంజుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఎన్ కౌంటర్ ఘటనా స్థలం నుంచి మావోయిస్టులు పరారయ్యారు. మరికొంత మంది మావోయిస్టులున్న్లు సమాచారం అందడంతో మారేడువిల్లి అడవుల్లో గ్రౌహౌండ్స్ బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.