15 ఓవర్లకు ఇంగ్లాండ్ 129/4

అహ్మదాబాద్ : భారత్ తో రెండో టీ20లో 15 ఓవర్లు పూర్తయ్యేసరికి ఇంగ్లాండ్ 129/4తో నిలిచింది. క్రీజులో మోర్గాన్ ( 23), బెన్ స్టోక్స్ (2) ఉన్నారు. ఇప్పటికే జట్టు మెరుగైన స్థితిలో ఉండటంతో భారీ షాట్లతో చెలరేగేందుకు బ్యాట్స్ మెన్ ప్రయత్నిస్తున్నారు. ఆఖరి ఓవర్లలో ధనాధన్ బ్యాటింగ్ విజృంభించి భారత్ కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. అంతకుముందు వాషింగ్టన్ సుందర్ వేసిన 11.1వ బంతికి జేసన్ రాయ్ (46 ) భువనేశ్వర్‎కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

ads

5. పట్టభద్రులకు కేటీఆర్ ధన్యవాదాలు ( 18. 30 )
హైదరాబాద్ : రాష్ట్రంలో జరిగిన రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం కోసం కృషి చేసిన పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఇంచార్జులుగా వ్యవహరించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికీ కేటీఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గత రెండు వారాలుగా పార్టీ యంత్రాంగం మొత్తం ఈ ఎన్నికల్లో విజయం కోసం కృషి చేసిందని, ఈ ఎన్నికల్లో పార్టీ చేసిన ప్రయత్నానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. విద్యావంతులంతా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని తాము చేసిన విజ్ఞప్తికి స్పందించిన ప్రతీ ఒక్క విద్యావంతునికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.