ఈఎస్ఐసీ మెడికల్ కాలేజీ నోటిఫికేషన్

హైదరాబాద్ : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) మెడికల్ కాలేజీ సనత్‎నగర్ ఫ్యాకల్టీ, క్లినికల్‎కు సంబంధించి 189 పోస్టుల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్‎ను జారీ చేసింది. ఫ్యాకల్టీ, సీనియర్ కన్సల్టెంట్ ( సూపర్ స్పెషాలిటీ ), ఎంట్రీ లెవల్ జూనియర్ కన్సల్టెంట్స్ , సూపర్ స్పెషలిస్ట్స్, బ్రాడ్ స్పెషాలిటీ కన్సల్టెంట్ , సీనియర్ రెసిడెంట్స్, సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ , జూనియర్ రెసిడెంట్స్ పోస్టులకు ఈ నోటిఫికేషన్‎ను రిలీజ్ చేసింది.

ads

టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించి ప్రొఫెసర్స్ – 11 , అసోసియేట్ ప్రొఫెసర్స్ – 25, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ – 11, సీనియర్ కన్సల్టెంట్ – 7, ఎంట్రీ లెవల్ జూనియర్ కన్సల్టెంట్ – 17, అర్హులైన వైద్యుల నుంచి స్పెషాలిటీ స్పెషలిస్ట్స్ ( జూనియర్ స్కేల్)- 5 , కన్సల్టెంట్ ( బ్రాడ్ స్పెషాలిటీ)- 8, సీనియర్ రెసిడెంట్స్ – 80, సీనియర్ రెసిడెంట్ ( బ్రాడ్ స్పెషాలిటీ ) – 16, సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ – 1, జూనియర్ రెసిడెంట్స్ – 3, జూనియర్ రెసిడెంట్స్ ( బ్రాడ్ స్పెషాలిటీ ) – 5 పోస్టులున్నాయి.