60యేండ్ల లోపువారికి ఆస్ట్రాజెనికా టీకా నిలిపివేత

బెర్లిన్ : 60యేండ్లు దాటిన వారు మాత్రమే ఆస్ట్రాజెనికా టీకా వేసుకోవాలని జర్మనీ కొత్త ఆదేశాలు జారీ చేసింది. యువతలో ఎక్కువ శాతం బ్లడ్ క్లాటింగ్ కేసులు నమోదు కావడంతో తాజా ఆంక్షలను అమలు చేస్తున్నారు. 60 యేండ్ల లోపు ఉన్నవారు కావాలంటే వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని వెల్లడించారు. కానీ డాక్టర్ల అనుమతి పొందిన తర్వాతనే ఆ టీకా తీసుకోవాలని జర్మనీ ప్రభుత్వం సూచించింది.

ads

ఆస్ట్రాజెనికా టీకాతో రక్తం గడ్డకడుతున్నట్లు కొన్ని దేశాలు ఆరోపణలు చేస్తున్నాయి. కానీ ఆ టీకా సురక్షితమైందని డబ్ల్యూహెచ్ఓతో పాటు ఈయూ హెల్త్ వాచ్ డాగ్ చెప్పింది. ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్నవారిలో అత్యంత అరుదుగా థ్రామ్ బోసిస్ లక్షణాలు కనిపించినట్లు ఛాన్సలర్ ఏంజిలా మెర్కల్ తెలిపారు. ఈ ఫలితాలను మనం పట్టించుకోకుండా ఉండటేమని ఆమె అన్నారు. స్టీకో పేరుతో జర్మనీలో వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం 60 యేండ్ల లోపు ఉన్నవారు ఈ టీకా వేసుకోవద్దన్నారు.