ముక్కోటి వృక్షార్చనలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలి

వరంగల్ : ఈ నెల 24న రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించతలపెట్టిన ముక్కోటి వృక్షార్చనలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలను నాటాలని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. గురువారం సాయంత్రం ఆయన ప్రజాప్రతినిధులు, అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని గ్రామాలలో ఉన్న నర్సరీలలో, మొక్కలు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. అందువల్ల ప్రతీ ఒక్కరు కనీసం 3 మొక్కలను నాటాలని అయన కోరారు. రాజకీయాలకతీతంగా ప్రత ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని అయన కోరారు.

ads

ఈ టెలీ కాన్ఫరెన్స్ లో మహిళా, శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.