షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు బంద్ ఉన్నప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని కోర్సులకు పరీక్షలు యథాతథంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పీజీ, బీటెక్ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయని బుధవారం నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. జేఎన్‎టీయూ పరిధిలోనూ పరీక్షలు యథాతథంగా జరగనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే కరోనా వల్ల పరీక్షలు రాయలేని వారికి ప్రత్యేకంగా నిర్వహించనుండగా, ప్రత్యేక పరీక్షను రెగ్యులర్‌గానే పరగణించనున్నారు.

ads