పట్టభద్రులకు అభివృద్ధిని వివరించాలి

జనగామ జిల్లా : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని పట్టభద్రులకు వివరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ​శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు సూచించారు. గురువారం
పాలకుర్తి నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్ష సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎర్రబెల్లి దిశానిర్దేశం చేశారు.

ads

ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడుతున్న ప్రతీ కార్యకర్త కు తగిన గుర్తింపు ఇస్తానని మంత్రి చెప్పారు. నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ అండగా ఉంటానన్నారు. టీఆర్​ఎస్​ చేసిన అభివృద్ధి, సంక్షేమం తో పాటు, బీజేపీ, ఇతర పార్టీ ల వైఫల్యాలను పట్టభద్రులకు వివరించాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. ఇతర పార్టీలకు బుద్ధి వచ్చేలా పల్లా రాజేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మండలస్థాయి, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి పట్టభద్రులను కలవాలన్నారు. టీఆర్​ఎస్​కు ఓటు వేయాలని అభ్యర్థించాలని మంత్రి ఎర్రబెల్లి మార్గ దర్శనం చేశారు. ఈ సమావేశంలో తొర్రూరు, పెద్ద వంగర, ఇతర మండల స్థాయి నాయకులు, ఇన్​చార్జిలు, కార్యకర్తలు పాల్గొన్నారు.