పాన్​కార్డుతో ఆధార్​ లింక్​ లేకపోతే జరిమానే

ads

న్యూఢిల్లీ : పాన్ కార్డును ఆధార్​ కార్డుతో లింక్​ చేసుకోవాలని కేంద్రం సూచించింది. లేదంటే ఆధార్​ కార్డు పనిచేయకుండా పోవడమే కాకుండా జరిమానా కూడా వేస్తామని తెలిపింది. ఈ నెల 23న పార్లమెంటులో ఆర్థిక బిల్లు -2021కి కీలక సవరణ చేసి ఆమోదించింది. ఈ సవరణ లో ఇన్​కం ట్యాక్స్​ చట్టం-1961లో కొత్తగా 234 హెచ్​ సెక్షన్​ చేర్పింది. ఈ నూతన సెక్షన్ ప్రకారం పాన్ కార్డు కలిగి ఉన్నవారంతా ఆధార్​కార్డుతో లింక్​ చేయించుకోవాలి. లేకపోతే ఫైన్​ చెల్లించాల్సి ఉంటుంది. ఈ జరిమానా ఎంత అనేది కేంద్రం త్వరలోనే వెల్లడించనుంది. దాదాపు రూ.1000 కి మించకుండా ఫైన్​ ఉంటుందనేది సమాచారం. ఈ చట్టం ప్రకారం పాన్​ కార్డు ఉన్నవారు ఈ నెల 31లోగా ఆధార్​తో లింక్​ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రతిపాదన ఏప్రిల్​ 1 నుంచి అమల్లోకి రానుంది. ఆదాయపు పన్ను చట్టంలోని వివిధ నిబంధనల ప్రకారం ఏ వ్యక్తినైనా పాన్​ను సమర్పించాలని కోరినప్పుడు సమర్పించకపోయినా, పనిచేయని పాన్​కార్డును ఇచ్చిన సదరు వ్యక్తి అధిక టీడీఎస్​ లేదా టీసీఎస్​ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఐటీ రిటర్స్న్​ దాఖలు చేయడం సాధ్యం కాకపోవచ్చు.