పశ్చిమ గోదావరి జిల్లా : నిడదవోలులో బాంబు బెదిరింపు ఫోన్ కాల్ కలకలం సృష్టించింది.
తహసీల్దార్ ఆఫీసు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బాంబు పెట్టామని ఆగంతకుడు ఫోన్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన ఆ రెండు కార్యాలయాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు కార్యాలయాల్లోని సిబ్బందిని బయటకు పంపారు. అనంతరం తనిఖీలు నిర్వహించగా ఎటువంటి బాంబు కనిపించలేదు. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు బాంబు స్క్వాడ్‌ను రప్పిస్తున్నారు. కార్యాలయాల చుట్టు పక్కల ప్రాంతాలను ఖాళీ చేయించారు. అయితే బాంబు పెట్టినట్లుగా ఆగంతకుడు నేరుగా పోలీసులకే ఫోన్ చేయడం విశేషం.
Home News