మంత్రి హరీశ్​కు సన్మానం

హైదరాబాద్​ : ఏకలవ్య భవనానికి హైదరాబాద్​లో ఎకరం భూమి కేటాయిస్తూ , కోటి రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం ఏకలవ్య సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావును కలసి సన్మానించారు. పుష్ప గుచ్ఛంతో సత్కరించారు.

‘ఏకలవ్య సంఘం భవనం పూర్తయ్యేందుకు పూర్తి స్థాయిలో నిధులను అందిస్తామమని మంత్రి హరీశ్​రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎరుకల సంఘం కన్వీనర్ కే సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు రాములు,అధ్యక్షులు కృష్ణ, ప్రధాన కార్యదర్శి రేణు కుమార్, కార్యదర్శి రాజు, శ్రీశైలం, పోచయ్య, రాజు, నర్సింహులు, జిల్లా అధ్యక్షులు మండ్లపురం గోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ, జిల్లా కార్యదర్శులు యాదగిరి, రాజు, విశ్వనాథ్, మాణయ్య, సంతోష్, తుల్జారాం, సాయికుమార్, నారాయణ ఎరుకల కుల బాంధవులు పాల్గొన్నారు.