ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శివన్ ఇకలేరు

కేరళ : ప్రముఖ సినిమాటోగ్రాఫర్, మూడుసార్లు నేషనల్ అవార్డు అందుకున్న శివన్ (89సం.లు) కన్నుమూశారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మరణించినట్లు ఆయన కుమారులు తెలిపారు. శివన్ కు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. శివన్ రెండో కొడుకు సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గానే పని చేస్తున్నారు. మిగిలిన ఇద్దరు కొడుకులు సంగీత్, సంజీవ్ కూడా సినీ రంగంలోనే స్థిరపడ్డారు.

ads

శివన్ మృతి అందరినీ కలచివేసింది. ఆయన మృతిపట్ల కేరళ సీఎం పినరయి విజయన్, గవర్నర్ అరిఫ్ అహ్మద్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిర్మాతగా, దర్శకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు శివన్ .