ప్రముఖ కవి డాక్టర్ తిరునగరి కన్నుమూత

హైదరాబాద్ : ప్రముఖ కవి దాశరథి పురస్కార గ్రహీత కవి తిలక డాక్టర్ తిరునగరి(76) అనారోగ్యంతో ఆదివారం అర్ధరాత్రి 11గంటలకు హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. పూర్వ నల్లగొండ జిల్లా ఆలేరులో జన్మించిన ఆయన అసలు పేరు “తిరునగరి రామానుజయ్య” . తెలుగు ఉపన్యాసకునిగా పనిచేసిన ఆయన ప్రవృత్తిగా తెలుగు సాహిత్యంలో విశేషమైన కృషి చేశారు. కవిత్వం, వ్యాసం, సమీక్షలు వంటి ప్రక్రియల్లో ఆయన అనేక ప్రామాణికమైన రచనలు చేశారు. ఆయన కుమారుడు “తిరునగరి శ్రీనివాస్”కూడా ప్రముఖ కవి, (పత్రికా) రచయిత. డాక్టర్ తిరునగరి మరణానికి తెలుగు సాహితి వేత్తలు తీవ్ర దిగ్భ్రాంతి చెంది నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ads