ఎంపీని నిలదీసిన రైతులు

నిజామాబాద్​ జిల్లా : నిజామాబాద్​ ఎంపీ అరవింద్​ను కమ్మర్పల్లి మండలం చౌటుపల్లి గ్రామంలో శనివారం రైతులు నిలదీశారు. పసుపు మద్దతు 15వేల ధర, పసుపు బోర్డు ఆలస్యం విషయంలో ఎంపీని రైతులు ప్రశ్నించారు. ఐదు రోజుల్లో పసుపు బోర్డు ఎందుకు తేలేదని ప్రశ్నించారు. కనీసం 15 వేల మద్దతు ధర ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు.

రాసిచ్చిన బాండ్ పేపర్ కు సమాధానం చెప్తావా..? లేక రాజీనామా చేసి ఉద్యమంలోకి వస్తావా .?. అని ప్రశ్నించారు. దీంతో ఎంపీ తాను బాండ్​ పేపర్​లో నిర్ణీత సమయం, మద్దతు ధర చెప్పలేదని దాటివేయడం గమనార్హం. హామీల వీడియో చూపిస్తూ మరీ రైతులు నిలదీయడంతో ఎంపీ అర్ధాంతరంగా సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఎంపీ డౌన్ డౌన్​ అంటూ రైతులు నినాదాలు చేశారు.