ఏసీబీకి భయపడి లంచం డబ్బు తగులబెట్టాడు

నాగర్ కర్నూల్ జిల్లా : తాను లంచంగా తీసుకున్న డబ్బును మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు తగలబెట్టాడు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెల్దండ ఎమ్మార్వో సైదులు గౌడ్ కోసం టీఆర్ఎస్ మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య గౌడ్ రూ. 5లక్షలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. అధికారులను చూసిన వెంకటయ్య గౌడ్ లంచం డబ్బులను తగలబెట్టాడు. క్రషర్ అనుమతి కోసం ఎమ్మార్వో సైదులు రూ.6 లక్షలు డిమాండ్ చేశాడు. రూ. 5 లక్షలకు ఒప్పందం కుదిరింది.

ads

ఈ నగదును వెంకటయ్య గౌడ్ కు ఇవ్వాలని ఎమ్మార్వో చెప్పాడు. నగదు తీసుకుంటున్న క్రమంలో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో గల ఎమ్మార్వో సైదులు గౌడ్ ఇంట్లో , అదేవిధంగా కల్వకుర్తి , జిల్లెల గూడ, వెల్దండ మండలం చెదురుపల్లి లోని వెంకటయ్య గౌడ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.