వారం పాటు ఫ్రెంచ్ ఓపెన్ వాయిదా

పారిస్ : ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీ వారం రోజుల పాటు వాయిదా వేశారు. ఈ విషయాన్ని టోర్నమెంట్ నిర్వాహకులు గురువారం నిర్ధారించారు. మెయిన్ డ్రా మ్యాచ్ లు మే30 నుంచి జూన్ 6 వరకు జరుగనున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో టోర్నీని ఆలస్యంగా ప్రారంభిస్తున్నట్లు ఫ్రెంచ్ టెన్నిస్ ఫెడరేషన్ వెల్లడించింది. క్వాలిఫయింగ్ రౌండ్లను మే 24 నుంచి 28 వరకు నిర్వహించన్నట్లు పేర్కొన్నారు.

ads