మెంతులతో మంచి హెయిర్ ప్యాక్

జుట్టు పెరుగుదల కోసం మెంతులను ఉపయోగించడం వల్ల అద్భుత ప్రయోజనాలను పొందవచ్చు. మెంతులలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చుండ్రు, పొడి జుట్టు, చివరలు చిట్లిపోవడం వంటి విభిన్న సమస్యలను ఎదుర్కోవడానికి కావాల్సిన గుణాలు ఇందులో ఉన్నాయి. మీ జుట్టు రాలడానికి గల కారణాలను తొలగించి, ఆరోగ్యవంతమైన జుట్టు పెరుగుదలకు మెంతులు ఎంతో సహాయపడతాయి. మెంతులలో ప్రోటీన్ కంటెంట్ రాలిన జుట్టు పెరగడంలో ఎంతో ఉపయోగపడుతుంది.
జుట్టు పెరుగుదలలో మందారం మెంతుల ప్యాక్ చాల ఉపయోగపడుతుంది. మందార ఆకులు, పువ్వులు జుట్టుకు తేమతో పాటు చుండ్ర నియంత్రణకు ఉపయోగపడతాయి. ఒక కప్పు నానబెట్టిన మెంతులు, 5 నుంచి 6 మందార పువ్వులు తీసుకుని రెండింటిని మెత్తని పేస్టులా గ్రైండ్ చేయాలి. ఈ పేస్టుని జుట్టుకి అప్లై చేసుకుని అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ ప్యాక్‎ని రెండు వారాలకు ఒకసారి ఉపయోగిస్తే జుట్టు సమస్యల నుంచి విముక్తి పొందుతారు.

ads

మెంతి గింజలను మీకు ఇష్టమైన నూనెలలో నానబెట్టడం ద్వారా మెంతుల యొక్క సహజ లక్షణాలను పొందవచ్చు. నూనె చుండ్రు, పొడిబారడం , జుట్టు రాలడం వంటి సమస్యలతో పోరాడటానికి శక్తిని అభివృద్ధి చేస్తుంది. ఈ మెంతి నూనె జుట్టును మెరిసేలా చేస్తుంది. కొబ్బరి/ ఆలివ్/బాదం నూనె ఏదైనా పర్వాలేదు. 3 స్పూన్ల మెంతి పౌడర్ లేదా మెంతులను తీసుకుని నూనెలో పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆయల్ కలర్ మారుతుంది. అప్పుడు దాన్ని వడగట్టి ఒక సీసాలో నిల్వచేసుకుని వారానికి రెండు సార్లు క్రమం తప్పకుండా తలకు మసాజ్ చేయడానికి ఈ నూనెను వాడాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకల కుదుళ్లకు రక్తప్రసరణ బాగా జరిగి, ప్రోటీన్లు అంది జుట్టు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.