పింగళి కుమార్తెకు ఆర్థిక సాయం

అమరావతి : జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. పింగళి కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మికి రూ.75లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులను సైతం జారీ చేసింది. ఆజాదీకా అమృత్ మహోత్సవాల ప్రారంభం సందర్భంగా సీఎం జగన్ నేడు గుంటూరు జిల్లా మాచర్లలో పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మిని ఆమె నివాసంలో కలిశారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆర్థికసాయం ఉత్తర్వులను ఆమెకు అందచేసి, నగదును ఆమె ఖాతాలో జమ చేయించారు. జాతీయ పతాకం రూపొందించి మార్చి 31 నాటికి వందేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా పింగళి కుమార్తెను సీఎం సత్కరించినట్లు సీఎంఓ ప్రకటనలో పేర్కొంది.

ads