తొలి ట్రాన్స్‎జెండర్ టాయిలెట్

లక్నో : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ టాయిలెట్‎ను వారణాసిలో నిర్మించింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా వారణాసిలోని కామాచ ప్రాంతంలో టాయిలెట్ ను నిర్మించింది. మేయర్ మృదుల జైస్వాల్ గురువారం దీన్ని ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‎లోనే ఇది మొదటి ట్రాన్స్‎జెండర్ టాయిలెట్ అని వారికి అవసరమైన ఇతర ప్రాంతాల్లో సైతం వీటిని మరింత విస్తృత పరిచేందుకు సిద్ధమని వారణాసి మేయర్ తెలిపారు. ఈ టాయిలెట్లు ట్రాన్స్‎జెండర్ల కోసం మాత్రమేనని ఇతరులను వీటిని ఉపయోగించుకోవద్దని వారణాసి మున్సిపల్ కమిషనర్ గౌరంగ్ రతి తెలిపారు. రాబోయే 3, 4 నెలల్లో వారికోస మరో నాలుగు టాయిలెట్లను నిర్మించనున్నట్లు తెలిపాడు.