అవిసెలతో అధిక బరువుకు చెక్

అవిసె గింజలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. వీటిలోని కరిగే పీచుపదార్థం ఆకలి మరియు తినాలనే కోరికను అణచివేయడానికి సహాయపడుతుంది. అవిసె గింజలలో గల పీచు పదార్థం వల్ల కడుపు నిండినట్లు అనిపించి శరీర బరువును తగ్గిస్తుంది. వీటిలో అధిక స్థాయిలో మ్యుసిలెజ్ గమ్ కంటెంట్ ఉంటుంది. ఈ రకమైన పీచు పదార్థం నీటిలో కరిగే గుణం కలిగి ఉంటుంది. దీనివల్ల ప్రేగులలో అద్భుతమైన లాభాలను కలిగిస్తుంది. ఇది శరీరంలో అధిక కొవ్వును తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల నెమ్మదిగా జీర్ణం అవుతుంది. తద్వారా ఎక్కువ సార్లు పిండి పదార్థాలు తినాలన్న కోరికను తగ్గిస్తుంది.

అవిసె గింజలను లైట్ గా వేయించి ( వేపుడు ) పౌడర్‎గా తయారు చేసి రోజూ పరగడుపున ఒక చెంచా నేరుగా తిన్నా, లేదా వేయించిన అవిసెలను నమిలి మింగి గోరువెచ్చని నీటిని తాగినా అధిక బరువు, పొట్ట ఇట్టే తగ్గిపోతాయి.