14 కంట్రీల్లో ‘ది ఫాగ్’

హైదరాబాద్​: మోషన్ పిక్చర్స్ పతాకం పై విరాట్‌ చంద్ర, చందన కొప్పిశెట్టి, హరిణి హీరో, హీరోయిన్లుగా సుదన్‌ దర్శకత్వంలో గోవర్ధన్ రెడ్డి నిర్మిస్తున్న రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ది ఫాగ్’. అన్ని కార్యక్రమాలు

పూర్తి చేసుకున్న ఈ చిత్రం14 దేశాల్లో ఈ నెల 5వ తేదీన విడుదల అవుతుంది.

‘మేము విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న మా సినిమాను 14 కంట్రీ స్ లలో విడుదల చేస్తున్నాము. అలాగే తమిళంలో కూడా విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. రోజు రోజుకు మాకు అమెజాన్ నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయి’అన్నారు చిత్ర నిర్మాత గోవర్ధన్​రెడ్డి.

‘ఇంతకుముందు నేను నటించిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాలో నా పర్ ఫార్మెన్సు కు మంచి పేరువచ్చింది. ఆ సినిమా నెట్ ఫ్లిక్స్​ లో విడుదల అవ్వగా ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ లో విడుదల అవ్వుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం ద్వారా వస్తున్న నన్ను ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదించాలి’ అన్నారు హీరోయిన్​ చందన కొప్పిశెట్టి.

నటీనటులు

విరాట్‌చంద్ర, చందన కొప్పిశెట్టి, హరిణి, అజయ్ గోష్, నందు, సుప్రియ, ప్రణీత, ప్రమోద్

సాంకేతిక నిపుణులు

సినిమా టైటిల్ : ‘ది ఫాగ్’
బ్యానర్ : వర్శి మోషన్ పిక్చర్స్
నిర్మాత : గోవర్ధన్ రెడ్డి
దర్శకత్వం : సుదన్
కెమెరామెన్ : హరినాథ్ సతీష్ రెడ్డి
మ్యూజిక్ : విజయ్ కోరాకుల, విశ్వ
ఎడిటర్ : సుదన్
పీఆర్వో : మధు వీ ఆర్