గూగుల్ ట్యాక్స్ లో విదేశీ సంస్థలు

న్యూఢిల్లీ: ‘గూగుల్ ట్యాక్స్’ పేరిట ఈక్వలైజేషన్ లేవీ చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై సోమవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనల్లో క్లారిటీ ఇచ్చారు. భారత్ లో ఉనికిలో ఉన్నా, లేకున్నా, సరిహద్దు ఆవల నుంచి లావాదేవీలు నిర్వహించే అన్ని విదేశీ కంపెనీలకు ఈ లెవీ వర్తిస్తుంది.

భారత్‎లో లేకున్నా ఉత్పత్తులను విక్రయిస్తున్న, సేవలందిస్తున్న విదేశీ కంపెనీలు ఈ ఈక్వలైజేషన్ లెవీ రెండు శాతం మేరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు గూగుల్ , నెట్ ప్లిక్స్ వంటి సంస్థలకు మాత్రమే ఈక్వలైజేషన్ లెవీ వర్తిస్తుందన్న అభిప్రాయం ఉండేది. రిటైల్, ట్రావెల్, ఆతిథ్య రంగాల్లో ఈ – కామర్స్ సేవలందిస్తున్న పలు ఈ-కామర్స్ సంస్థలు ఈ ట్యాక్స్ చెల్లించాల్సిందేనని ఇండియాటెక్ ఆర్గ్ సీఈవో రమేష్ కైలాశం తెలిపారు.

భారత్ లో సంపాదించిన రెవెన్యూపై ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్‎తో పాటు అడోబ్ , నెట్ ఫ్లిక్స్ సుమారు రూ.400 కోట్ల మేరకు ఈక్వలైజుషన్ లెవీ చెల్లించాయి. క్లారిటీ లేదన్న సాకుతో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లింక్ ఇన్ ఈ-బే, ఉబేర్ వంటి సంస్థలు ఈ లెవీని చెల్లించలేదు.

2016లో కేంద్రం ఈ గూగుల్ ట్యాక్స్‎ను ప్రవేశపెట్టింది. దేశీయ, విదేశీ ఇంటర్నెట్ సంస్థల మధ్య సమాన అవకాశాలను కల్పించడం కోసం దీన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. దీని ప్రకారం గూగుల్, అడోబ్, ఉబేర్, ఉడేబీ, జూమ్, ఎక్స్ పెడియా , అలీబాటా, ఐకియా, లింక్డ్ ఇన్, స్పోటీపై, ఈ – బే వంటి ఇంటర్నెట్ సంస్థలు గూగుల్ ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి.