శ్రీవారికి భారీ విరాళం


చిత్తూరు జిల్లా : తిరుమల శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు పోస్కో సంస్థ రూ.9కోట్ల విరాళం ఇచ్చింది. ఈ మేరకు సంస్థ సీఈవో సంజయ్‌ పాసి విరాళానికి సంబంధించిన డీడీలను శుక్రవారం ఉదయం టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. అనంతరం సంస్థ సీఈవో సంజయ్​పాసి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాతలకు పండితులు వేద ఆశీర్వచనంచేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ads