ఘోర రోడ్డు ప్రమాదం..4గురు మృతి

విజయనగరం జిల్లా : విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయనగరం మండలం సుంకరి పేట దగ్గర విశాఖ-విజయనగరం రహదారిపై ఎదురు ఎదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సుల్లో ఒక ఆర్టీసీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొనడంతో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లతో పాటు ఇద్దరు ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్నప్రయాణికులకు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, ఆర్టీసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సుల్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటికి తీసి, క్షతగాత్రులను అంబులెన్స్ లలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. నలుగురి మృతితో పాటు, పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలపాలవ్వడంతో ఆ ప్రాంతం అంతా విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే రోడ్డు ప్రక్కన ఉన్న డంపింగ్ ని తగలబెట్టడం వల్ల విపరీతంగా పొగ వ్యాపించడంతో వాహనాలు ఒకదానికొకటి స్పష్టంగా కనిపించకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

ads