భారత్ కు బాసటగా నిలిచిన ఫ్రాన్స్, కువైట్

హైదరాబాద్ : కరోనా వేళ భారత్ కు ఫ్రాన్స్, కువైట్ దేశాలు బాసటగా నిలిచాయి. కరోనాను ఎదుర్కొనేందుకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. 2వేల మందికి 5 రోజులు సరిపడా లిక్విడ్ ఆక్సీజన్ పంపుతున్నట్లు తెల్పింది. అధిక సామర్థమున్న 8 ఆక్సీజన్ జనరేటర్లను పంపుతోంది. ఒక్కో జనరేటర్ 250 పడకలకు యేడాదంతా సరఫరా చేయగల ఆక్సీజన్ ను అందిస్తాయి.

ads

అదే విధంగా ఐసీయూ పరికరాలు, 28 వెంటిలేటర్లు పంపుతున్నట్లు పేర్కొంది. భారత్ కు బాసటగా నిలవాలని కువైట్ క్యాబినెట్ నిర్ణయించింది. ఆక్సీజన్ పరికరాలు , వైద్య పరికరాలు పంపాలని నిర్ణయం తీసుకుంది. భారత్ లో కరోనా మరణాలు తగ్గించేందుకు సహకరిస్తామని కువైట్ పేర్కొంది.