సోనుసూద్ ఫౌండేషన్‌ పేరుతో మోసం

హైదరాబాద్ : రోజురోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఎప్పటికప్పుడు సైబర్ దొంగల్ని పట్టుకుంటున్నా నేరాలు మాత్రం ఆగడం లేదు. కొత్త తరహాలో ఎవరికి అనుమానం రాకుండా నేరాలకు తెరలేపుతున్నారు సైబర్​ మోసగాళ్లు.తాజాగా సోనుసూద్ ఫౌండేషన్ పేరుతో సైబర్ నేరగాడు భారీ మోసానికి పాల్పడ్డాడు.

ads

ఆన్‌లైన్‌లో తన మొబైల్ నెంబర్ ను సోను సూద్ నెంబర్ గా పెట్టుకున్నాడు నేరగాడు. సోనుసూద్​ నెంబర్​​ అనుకుని ఫోన్​ చేసి సాయం కోసం ఆశ్రయించిన మాదాపూర్ వ్యక్తిని దారుణంగా మోసం చేశాడు. రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజు పేరుతో రూ. 60 వేలు వసూలు చేశాడు సైబర్ నేరగాడు పంకజ్ సింగ్. డబ్బులు చెల్లించినా ఎంతకీ సాయం అందకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు . దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.