“ఫ్రెండ్ షిప్” హక్కులు ఎవరికంటే

క్రేజీ చిత్రం “ఫ్రెండ్ షిప్” (సింగ్ & కింగ్) హక్కులు సొంతం చేసుకున్న ఏఎన్ బాలాజీ

హైదరాబాద్​ : క్రికెట్ కింగ్ హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్’ కలయికలో రూ. 25 కోట్ల భారీ బడ్జెట్ తో తమిళంలో రూపొందుతున్న క్రేజీ చిత్రం “ఫ్రెండ్ షిప్”. ఈ చిత్రం హక్కులు ప్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నారు శ్రీలక్ష్మీ జ్యోతి క్తియేషన్స్ అధినేత ఏ.ఎన్. బాలాజీ. ‘జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య’ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని “ఫ్రెండ్ షిప్” పేరుతోనే.. ‘సింగ్ అండ్ కింగ్’ అనే ట్యాగ్ లైన్ జోడించి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు బాలాజీ సన్నాహాలు చేసుకుంటున్నారు. హర్భజన్ సింగ్ కు దేశవ్యాప్తంగా ఉన్న పాపులారిటీ దృష్ట్యా ఈ చిత్రం హిందీలోనూ విడుదల కానుండడం విశేషం.

ఈ చిత్రం చివరి షెడ్యూల్ కోయంబత్తూర్, ఊటీలలో జరగనుంది. మాజీ ‘మిస్ శ్రీలంక’ మరియు తమిళ బిగ్ బాస్ విన్నర్ ‘లోస్లియా’ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ‘జి-జాంబి’ హీరో ఆర్యన్ గౌడ్, ‘రంగస్థలం’ మహేష్, అంకిరెడ్డి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ తమిళ నిర్మాత జే సతీష్ కుమార్ (జే ఎ స్ కే) విలన్ గా నటిస్తున్నారు.

‘ఇంత క్రేజీ ప్రాజెక్టును తెలుగులో రిలీజ్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రస్తుతం కోయంబత్తూర్, తదుపరి ఊటీలో చివరి షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వీలయినంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ బ్యాక్ డ్రాప్ లో ప్రేమలు… గొడవలు మధ్య ఆద్యంతం ఉత్కంఠగా నడిచే ఈ చిత్రం యూత్ నే కాకుండా అందరినీ ఉర్రూతలూగిస్తుంది’ అన్నారు శ్రీలక్ష్మి జ్యోతి క్తియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ .

ఈ చిత్రానికి మాటలు: రాజశేఖర్ రెడ్డి, సంగీతం: డీఎం .ఉదయ్ కుమార్, సినిమాటోగ్రఫీ: శాంతకుమార్, నిర్మాత : ఏఎన్ బాలాజీ, దర్శకత్వం : జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య .