“ఫ్రెండ్ షిప్” టీజర్​ అవుట్​

యాక్షన్ కింగ్ అర్జున్-క్రికెట్ కింగ్ హర్భజన్ సింగ్ “ఫ్రెండ్ షిప్” (సింగ్ & కింగ్) టీజర్ విడుదలహైదరాబాద్: ‘ క్రికెట్ కింగ్ హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్’ కలయికలో రూ. 25 కోట్ల భారీ బడ్జెట్ తో తమిళంలో రూపొందుతున్న క్రేజీ చిత్రం “ఫ్రెండ్ షిప్”. ‘జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య’ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని “ఫ్రెండ్ షిప్” పేరుతోనే. ‘సింగ్ అండ్ కింగ్’ అనే ట్యాగ్ లైన్ జోడించి శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏ.ఎన్. బాలాజీ తెలుగులో నిర్మిస్తున్నారు.

ads

ఈ చిత్రం చివరి షెడ్యూల్ కోయంబత్తూర్, ఊటీలలో జరుగుతోంది. మాజీ ‘మిస్ శ్రీలంక’ మరియు తమిళ బిగ్ బాస్ విన్నర్ ‘లోస్లియా’ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నిర్మాత జే సతీష్ కుమార్ (జెఎ స్ కె) విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ తాజాగా విడుదలైంది.

నిర్మాత శ్రీలక్ష్మి జ్యోతి క్తియేషన్స్ అధినేత ఏ.ఎన్.బాలాజీ మాట్లాడుతూ…

“ఇప్పటివరకు నేను తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 50కి పైగా సినిమాలు నిర్మించాను. నా కెరీర్ లో తొలిసారి “ఫ్రెండ్ షిప్” చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాను. ఈ చిత్రం టీజర్ విడుదల చేశాం. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం” అన్నారు నిర్మాత శ్రీలక్ష్మి , జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ.

ఈ చిత్రానికి పీఆర్వో : ధీరజ్-అప్పాజీ, మాటలు : రాజశేఖర్ రెడ్డి, సంగీతం : డీ ఎం. ఉదయ్ కుమార్, సినిమాటోగ్రఫీ : శాంతకుమార్, నిర్మాత: ఏఎన్ బాలాజీ, దర్శకత్వం : జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య