మినీ మేడారం జాతరకు నిధులు

ములుగు జిల్లా: తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు కొనసాగే మినీ మేడారం జాతరకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. జాతరకు హాజరయ్యే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కోటి 52 లక్షల రూపాయలను విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నిధులను వివిధ శాఖలకు కేటాయించి జాతరకు హాజరయ్యే భక్తులకు మెరుగైన వసతులు కల్పించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.