ఫిబ్రవరి 5న ‘జి- జాంబీ’

హైదరాబాద్​ : ఆర్యన్​ గౌర హీరోగా దివ్య పాండే హీరోయిన్ గా సాయి సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్యన్ గౌర-దీపు స్వీయ దర్శకత్వంలో సూర్య నిర్మించిన చిత్రం “జి- జాంబీ”. తెలుగులో మొదటిసారి గా జాంబీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని క్లీన్ యూ సర్టిఫికెట్ సంపాదించుకుంది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి ఫిబ్రవరి 5న ఈ చిత్రం అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ-రిలీజ్ వేడుకను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిపారు. సాంగ్స్, ట్రైలర్స్ ప్రదర్శించారు.

‘బేసిగ్గా నేను సాఫ్ట్ వేర్ ని. హీరో అవ్వాలనేది నా కల. ఇక్కడిదాకా రావడానికి ఏడేళ్లు పట్టింది. తెలుగు ప్రేక్షకులు ఇప్పటిదాకా రకరకాల సినిమాలు చూసుంటారు. జాంబీస్ జోనర్లో ఇంతవరకూ తెలుగులో సినిమా రాలేదు. జాంబీ జోనర్లో కొత్తగా సినిమా చేశాం. ఇదే ఫస్ట్ టైమ్. డే అండ్ నైట్ కష్టపడి ఈ చిత్రానికి వర్క్ చేశాం. నన్ను నా కథని నమ్మి కొత్తవాల్లమైనా బడ్జెట్ కి వెనకాడకుండా మా నిర్మాత సూర్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయనకి లైఫ్ లాంగ్ ఋణపడి ఉంటాను. మైక్రో ఇయర్ సౌండ్ డిజైన్ ని కొత్తగా ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నాం. అదొక కొత్త ఎక్స్ పీరియెన్స్ కలిగిస్తుంది. సినిమా చాలా బాగా వచ్చింది. మా టీమ్ అందరూ ఎంతో కష్టపడి వర్క్ చేశారు. వారందరికీ నా థ్యాంక్స్​. సెన్సార్ పూర్తయింది. క్లీన్ యు వచ్చింది. వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి 5న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ప్రేక్షకులు మా చిన్న సినిమాను ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’అన్నారు హీరో ఆర్యన్​ గౌర.

‘ఎంతోమందిని చూసి ఇన్​స్పైర్​ అయి ఈ సినిమాకి దర్శకత్వం వహించాను. ఆర్యాన్, సూర్య లేకపోతే ఈ సినిమా లేదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకూ తోడుగా ఉండి ఎన్నో విషయాల్లో హెల్ప్ చేసిన ఆర్యాన్ కి నా స్పెషల్ థ్యాంక్స్. అలాగే నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ సపోర్ట్ చేసి సినిమా బాగా రావడానికి సహకరించారు’ మా టీమ్ అందరికీ ధన్యవాదాలు అన్నారు దర్శకురాలు దీపు.

ఆర్యన్ గౌర, దివ్య పాండే జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజశేఖర్, పద్మావతి, లోకేష్ చరణ్ ఉత్తరాది, యువతేజ, గౌతమ్ ఆవుల, మనోజ్ వనపాల, హర్ష సాధుల, విజయ్ కృష్ణ చావకుల, హర్ష నల్లబెల్లి, నేత, చిస్తీ, మారురి హర్ష, జస్వంత్, బండ మహేష్, శరత్, రాగ, సుష్మిత తదితరులు నటించారు.

ఈ చిత్రానికి మ్యూజిక్ : వినోద్ కుమార్, డీవోపీ యస్. ఆర్ శేఖర్, ఎడిటర్ : పవన్ కుమార్ వీ, ఆర్ట్ ; శివ బోగోలు, కొరియోగ్ర ఫీ: వీ యమ్ కృష్ణ, పాటలు : రాంబాబు గోసాల, పీఆర్వో ; తేజస్వీ సజ్జ, నిర్మాత : సూర్య, రచన-దర్శకత్వం : ఆర్యన్ అండ్ దీపు.