రిలీజ్​ తేదీ ఖరారు

హైదరాబాద్​ : బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్ఫ‌ణ‌లో రూపొందుతోన్నచిత్రం ‘గాలి సంప‌త్`. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించడంతో పాటు స్క్రీన్ ప్లే అందిస్తూ ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ కూడా చేస్తుండ‌డంతో సినిమాకి స్పెష‌ల్ క్రేజ్ వ‌చ్చింది. వ‌రుస‌గా ఐదు బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మ‌రో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా `గాలి సంప‌త్` రూపొందుతోంది. అనిల్ కో డైరెక్ట‌ర్, రైట‌ర్, మిత్రుడు ఎస్ క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్​టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్ తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ హీరో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా న‌ట‌కిరీటి డాక్టర్​ రాజేంద్ర ‌ప్ర‌సాద్ `గాలి సంప‌త్‌`గా టైటిల్ రోల్ పోషిస్తున్నఈ మూవీకి అనీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ మూవీ మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి11న గ్రాండ్‌గా విడుద‌ల‌వుతుంది.

క‌థ‌ : ఎస్‌. క్రిష్ణ‌,
ర‌చ‌నా స‌హ‌కారం : ఆదినారాయ‌ణ‌
సినిమాటోగ్ర‌ఫీ : సాయి శ్రీ రామ్‌
సంగీతం : అచ్చు రాజ‌మ‌ణి
ఆర్ట్‌ : ఎ ఎస్ ప్ర‌కాశ్‌
ఎడిట‌ర్‌ : త‌మ్మిరాజు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌ : నాగ‌మోహ‌న్ బాబు. ఎమ్‌
మాట‌లు : మిర్చి కిర‌ణ్‌
లిరిక్స్‌ : రామ‌జోగ‌య్య శాస్త్రి
ఫైట్స్‌ : న‌భ‌
కొరియోగ్ర‌ఫీ : శేఖ‌ర్, భాను
మేక‌ప్‌ : ర‌ంజిత్‌
క్యాస్ట్యూమ్స్‌ : వాసు
చీఫ్ కో డైరెక్ట‌ర్‌ : స‌త్యం బెల్లంకొండ‌
నిర్మాణం : ఇమేజ్ స్పార్క్ ఎంటర్ టైన్మెంట్, షైన్ స్క్రీన్స్
నిర్మాత‌ : ఎస్. క్రిష్ణ‌
స్క్రీన్ ప్లే, సమ‌ర్ప‌ణ‌, దర్శకత్వ పర్యవేక్షణ : అనిల్ రావిపూడి
ద‌ర్శ‌క‌త్వం : అనీష్