హరిద్వార్​లో హైఅలెర్ట్

హరిద్వార్‌ : హరిద్వార్‌ : ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో నందాదేవి గ్లేసియర్ విరిగి ధౌలిగంగా నదిలో పడటంతో ఆకస్మిక వరద పోటెత్తింది. దీని కారణంగా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌, రిషికేష్‌లతోపాటు యూపీలో గంగా పరివాహక ప్రాంతాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు. ఈ వరద కారణంగా రుషిగంగా విద్యుత్ ప్రాజెక్ట్ ధ్వంసమైంది. ఇక్కడ పనిచేస్తున్న 100 నుంచి 150 మంది కార్మికులు వరదలో గల్లంతైనట్లు ఉత్తరాఖండ్ సీఎస్ ఓంప్రకాశ్‌ వెల్లడించారు. సహాయక చర్యలు చేపట్టడానికి వందలాది మంది ఐటీబీపీ పోలీసు సిబ్బంది వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లినట్లు ఓ అధికారి వెల్లడించారు.

అటు 200 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొండ చర్యలనుంచి ఇప్పటి వరకు పది మృతదేహాలను ఎన్డీఆర్​ఎఫ్​ సిబ్బంది వెలికితీశారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరాలు అడిగి తెలుసుకున్నారు.