రెమిడెసివిర్ బాక్ల్ లో అమ్ముతున్న ముఠా అరెస్టు

వరంగల్ అర్బన్ జిల్లా : కరోనా వ్యాధిగ్రస్తులకు అత్యవసర సమయాల్లో డాక్టర్లు అందించే రెమిడెసివిర్ ఇంజక్షన్లను ఎం.ఆర్.పి కన్నా అత్యధిక రేట్లతో అమ్ముతూ సొమ్ముచేసుకుంటున్న ముగ్గురు సభ్యుల ముఠాను టాస్క్ ఫోర్స్ మరియు సుబేదారి పోలీసులు సంయుక్తంగా గురువారం అరెస్టు చేసారు. వీరి నుండి 28 రెమిడెసివిర్ ఇంజక్షన్లు, 20 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో వరంగల్ నగరంలోని మండిబజార్ కు చెందిన ఫార్మసీ అసిస్టెంట్ బాగాజీ మనోహర్ , భీమారంకు చెందిన ఫార్మాసిస్ట్ కొలిపాక కుమారస్వామి , కరీమాబాద్ కు చెందిన ఫార్మసీ వర్కర్ ఐత అశోక్ లను పోలీసులు అరెస్ట్ చేసి సీపీ సమక్షంలో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.

ads

ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి వెల్లడించారు. ప్రస్తుతం కరోనా వ్యాధి తీవ్రత అధికంగా వుండటంతో పాటు, అత్యధిక వ్యాధిగ్రస్తులు వ్యాధి నివారణకు హస్పిటల్స్ ను ఆశ్రయిస్తున్నారు. ఇదే సమయంలో కరోనా వ్యాధి చికిత్సలో భాగంగా వ్యాధిగ్రస్తులకు అత్యవసర సమయంలో అందించే రెమిడెసివిర్ ఇంజక్షన్లు వినియోగం అధికం కావడంతో పాటు ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన కొందరు బ్లాక్ దందాకు ఒడిగట్టినట్లు తెలిపారు. స్థానికంగా వుండే హస్పిటల్స్ లలో వుండే మందులషాపులో పనిచేస్తూ రెమిడెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ ద్వారా అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకొనేందుకు సిద్ధపడ్డారు. ఇందులో భాగంగా నగరంలోని ఓ ప్రవైయిట్ హస్పిటల్ లో మందు దుకాణాన్ని నిర్వహిస్తున్న ఈ ముఠా సభ్యులు హెటీరో ఫార్మ కంపెనీ నుండి రెమిడెసివిర్ ఇంజక్షన్లను ఒక్కోటి 2,800/-రూపాయల చొప్పున కొనుగోలు చేసి వ్యాధిగ్రస్తులకు 3,490/- అమ్మాల్సి వుంటుందన్నారు. కాని ప్రస్తుతం ఈ రెమిడెసివిర్ ఇంజక్షన్లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో లేకపోవడంతో సంబంధిత హస్పిటల్స్ ఫార్మసీ యాజమాన్యం మరియు సిబ్బంది కరోనా వ్యాధి గ్రస్తులకు 35వేల రూపాయల నుండి 45వేల రూపాయలకు బ్లాక్ మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకోవడం జరుగుతోందని తెలిపారు.

ఈ బ్లాక్ దందాపై సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ మరియు సుబేదారి పోలీసులు సంబంధిత హస్పిటల్స్ మందుల షాపులపై దాడులు నిర్వహించి వారి వద్ద నుండి 28 రెమిడెసివిర్ ఇంజక్షన్లతో పాటు రూ. 20వేల నగదు, ముగ్గురు నిందితులను పోలీసులు ఈరోజు మద్యాహ్నం అరెస్టు చేసారు. ఈ బ్లాక్ ముఠాను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డి.సి.పి పుష్పా, హన్మకొండ ఎ.సి.పి జితేందర్ రెడ్డి, టాస్క్ఫో ర్స్ ఎ.సి.పి ప్రతాప్ కుమార్, ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ జీ, సుబేదారి ఇన్ స్పెక్టర్ రాఘవేందర్, సుబేదారి సబ్-ఇన్స్ స్పెక్టర్ సాంబమూర్తి, టాస్క్ ఫోర్స్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సోమలింగం, కానిస్టేబుల్లు శ్రీకాంత్, శృంస్స్మహేందర్, మహమ్మద్ ఆలీ, శ్రీనివాస్, రాజేష్, సృజన్, మీర్ మహమ్మద్ ఆలీ, శ్రీనివాస్ రాజు, చిరు మరియు విజయ్ లను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు.