భారీగా గంజాయి పట్టివేత

వరంగల్ అర్బన్ జిల్లా : గ్రేటర్ వరంగల్ ఒకటవ డివిజన్ ఆరేపల్లి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న భారీ గంజాయి పట్టుపడింది. హసన్ పర్తి పోలీసులు శనివారం సుమారు 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మార్గం గుండా గంజాయిని వరంగల్ నగరానికి తరలిస్తున్నారని పక్కా సమాచారం మేరకు పోలీసులు దామెర ,ఆరేపల్లి, కొత్తపేట మార్గంలో నిఘా పెట్టారు .ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న టాటా ఏస్ వాహనాన్ని నిలిపివేశారు. అందులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గుర్తించి హసన్ పర్తి పోలీసులు పట్టుకొన్నారు. పట్టుబడిన గంజాయిని వరంగల్ ఎమ్మార్వో సమక్షంలో పంచనామా నిర్వహించారు.

ads