భారీగా పెరిగిన గ్యాస్ ధరలు

హైదరాబాద్: చమురు కంపెనీలు సామాన్యులపై పెను భారాన్ని మోపుతున్నాయి. పెట్రోల్,డీజిల్ ధరలు ఇప్పటికే రికార్డు స్థాయికి చేరగా గురువారం వంటగ్యాస్ ధరలను కేంద్రం పెంచింది. సబ్సిడీ సిలిండర్ పై రూ.25, వాణిజ్య సిలిండర్ పై రూ.184 పెంచాయి. సవరించిన కొత్త ధరలు గురువారం నుంచి అమలులోకి వస్తాయని చమురు కంపెనీలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.664 ఉండగా..తాజాగా పెంచిన ధరతో రూ.719కి చేరింది. లక్నోలో రూ.757,నోయిడాలో రూ.717, కోల్ కతాలో రూ.745.50 , ముంబైలో రూ.719 మారగా చైన్నైలో రూ.735, బెంగళూరులో రూ. 722 రూపాయలుగా, హైదరాబాద్ లో రూ.771.50 కు చేరాయి. గతేడాది డిసెంబర్ లో చమురు కంపెనీలు ఎల్ పీజీ ధరలు పెంచగా.. ఈ ఏడాదిలో తొలిసారిగా గ్యాస్ ధరలు పెరిగాయి.