జూలైలో వస్తున్నాడు ‘గని’

జూలై 30న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతోన్న మెగాప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ ‘గని’హైదరాబాద్​ : మెగాప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్ హీరోగా ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రాన్ని జూలై 30న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు తెలిపారు.

బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన చంద్ర త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వ‌రుణ్‌తేజ్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి డిఫ‌రెంట్ లుక్‌తో బాక్సర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్‌ ఎస్‌ త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి జార్జ్ సీ విలియ‌మ్స్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

నటీనటులు:
వ‌రుణ్ తేజ్‌, స‌యీ మంజ్రేక‌ర్‌, ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం :
సినిమాటోగ్ర‌ఫీ : జార్జ్ సీ విలియ‌మ్స్‌
మ్యూజిక్‌ : త‌మ‌న్‌ ఎస్‌ ఎస్​
ఎడిటింగ్‌ : మార్తాండ్ కే వెంక‌టేశ్‌
నిర్మాత‌లు : సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ
ద‌ర్శ‌క‌త్వం: కిర‌ణ్ కొర్ర‌పాటి