కరోనా డెడ్ బాడీ అంత్యక్రియల్లో ఎమ్మెల్యే

జనగామ జిల్లా : కరోనాతో మరణించిన వారి అంత్యక్రియల్లో పాల్గొంటే కరోనా రాదని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే , తెలంగాణ మాజీ తొలి ఉపముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. చెప్పడమే కాకుండా కరోనాతో మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అంత్యక్రియలు దగ్గరుండి జరిపించి ప్రజలు అపోహలు వీడాలని ఆయన సూచించారు.

ads

జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని జఫర్ గఢ్ మండలం కూనూరు గ్రామానికి చెందిన ఏఎంసీ డైరెక్టర్ చౌదర్పల్లి మల్లయ్య ( 50 ) కరోనాతో మృతి చెందాడు. కాగా ఎమ్మెల్యే దగ్గరుండి మృతదేహాన్ని చితిపైకి స్వయంగా మోశారు. కరోనాతో మృతిచెందిన మృతదేహానికి వైరస్ ఉండదన్నారు. కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియల్లో నిర్భయంగా పాల్గొనవచ్చని ఎమ్మెల్యే తెలిపారు.