భారీగా సభ్యత్వాలు చేయించాలి

జనగామ జిల్లా : భారీగా టీఆర్​ఎస్​ సభ్యత్వాలు చేయించాలని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. త్వరలో రేషన్​కార్డు లేని వారందరికీ రేషన్​కార్డులు అందజేస్తామన్నారు. అలాగే 57 ఏళ్లు నిండిన వారందరికీ ఫించన్ ను ప్రభుత్వం అందించనుందని ఎమ్మెల్యే రాజయ్య వెల్లడించారు. శుక్రవారం టీఆర్ఎస్​ కార్యకర్తల సంక్షేమ యాత్రలో ఆయన పాల్గొన్నారు. వేలేరు మండలం మల్లికుదర్లలో పార్టీ సభ్యత్వ నమోదు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా పూర్తయిన సభ్యత్వ నమోదు పుస్తకాలను పార్టీ మండల అధ్యక్షుడు కీర్తి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ఎమ్మెల్యే కు అందజేశారు. అనంతరం చిలుపూర్​ మండలంలోని వంగాపల్లి, నష్కల్, దేశాయ్ తండా, చిన్నపెండ్యాల్,రాజవరం, తీగల తండా, వెంకటేశ్వర్లపల్లె, చిల్పూర్, వెంకటాద్రిపేట్​, మల్కాపుర్, కొండాపూర్, శ్రీపతిపల్లి, లింగంపల్లి, ఫత్తేపూర్, గార్లగడ్డ తండా, కిష్టాజిగుడెం, పల్లగుట్ట గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. పార్టీ సభ్యత్వ నమోదుపై నాయకులకు పలు సూచనలు చేశారు.

ads

ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేసిరెడ్డి సమ్మి రెడ్డి, జెడ్పీటీసీ చాడ సరిత, సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీటీసీ బాల్లే వెంకటేశ్వర్లు, మండల అధికార ప్రతినిధి జోగు ప్రసాద్, మాజీ ఎంపీపీ బొజ్జ రవీందర్, సర్పంచ్ కర్ర సోమిరెడ్డి, ఉపసర్పంచ్​ గోవిందా సురేష్, గ్రామశాఖ అధ్యక్షులు బట్టు కోటి ,మండల నాయకులు ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.