తలసానిని కలిసిన మేయర్​, డిప్యూటీ మేయర్​

హైదరాబాద్​ : నూతనంగా ఎన్నికైన హైదరాబాద్​ మేయర్​ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ను కలిశారు. మాసాబ్​ ట్యాంక్​లోని కార్యాలయంలో మంత్రిని కలిసిన మేయర్​ విజయలక్ష్మిని, వెస్ట్​మారేడ్​పల్లిలోని నివాసంలో కలిసిన డిప్యూటీ మేయర్ శ్రీలతను మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ సన్మానించారు. అనంతరం వారికి అభినందనలు తెలిపారు.