ఎయిర్‎పోర్ట్‎లో గోల్డ్ పట్టివేత

హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. డిఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా పూణే నుండి (6E-3126)ఇండిగో విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికులను డీఆర్ఐ అధికారులు తనిఖీలు చేశారు. వారి నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.91 లక్షల విలువచేసే (6 బంగారు బిస్కట్లు,) 1867.600 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని ఒకరిని అరెస్టు చేశారు.