మళ్లీ తగ్గిన బంగారం ధరలు

న్యూఢిల్లీ : దేశంలో పసిడి ధరలు మరింత తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.522 తగ్గి రూ.43,887కు చేరింది. క్రితం ట్రేడ్‎లో 10గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.44,409 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‎లలో విలువైన లోహాలపై పెట్టుబడులకు మదుపర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో నేడు బంగారం ధరలు దిగి వచ్చాయని హెచ్‎డీఎఫ్‎సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.

ads

ఇక బంగారంతో పాటు సిల్వర్ ( వెండి ) ధరలు కూడా నేడు భారీగానే తగ్గాయి. ఢిల్లీ మార్కెట్‎లో కిలో వెండి ధర రూ.1,822 తగ్గి, రూ.64,85 కు చేరంది. క్రితం ట్రేడ్‎లో కిలో వెండి ధర రూ. 66,627 వద్ద ముగిసింది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్‎లలో నేడు ఔన్స్ బంగారం ధర 1,696 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 25.20 అమెరికన్ డాలర్ లు పలికింది.