పెరిగిన గోల్డ్ , సిల్వర్ రేట్స్

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు తిరిగి పుంజుకోవడంతో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,000 చేరుకుంది. ఇటీవల కేంద్ర బడ్జెట్ అనంతరం దేశంలో గోల్డ్ రేట్స్ భారీగా క్షీణించాయి. దాదాపు రూ.2000 వరకు తగ్గాయి. ఒక దశలో 99.9 స్వచ్ఛత కల్గిన బంగారం ధర రూ.47,000 కంటే దిగువకు వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‎లలో పాజిటివ్ ట్రెండ్ కారణంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

హైదరాబాద్‎లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.640 పెరిగి రూ.48,710 చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.590 పెరిగి రూ.44,650కి చేరుకుంది. ఆగస్ట్ 7 నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200లతో పోల్చితే రూ.7,490 తక్కువగా ఉంది. వెండి ధరలు కూడా నేడు భారీగా పెరిగాయి. ఒక్కరోజే కిలో వెండిపై రూ.2,100 పెరిగి 75,200కు చేరుకుంది.