కార్మికుల పక్షపాతి సీఎం కేసీఆర్  

వరంగల్ అర్బన్ జిల్లా : కార్మికుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సంఘటిత, అసంఘటిత రంగంలోని కార్మికుల సంక్షేమం నిమిత్తం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. మే డే సందర్భంగా శనివారం హన్మకొండలోని మర్కాజీ స్కూల్ లో మే డే వేడుకల్లో దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. జెండా ఆవిష్కరించి అనంతరం కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కార్మికులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని, ప్రభుత్వం కార్మికుల కోసం ప్రవేశపెట్టే పథకాలపై ప్రతీ కార్మికునికి అవగాహన ఉండాలని చీఫ్ విప్ తెలిపారు. ప్రపంచ కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు తెలిపారు.

ads

కార్మికులంతా ప్రభుత్వ పథకానలు ఉపయోగించుకోవాల్సిందిగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కోరారు. భవన నిర్మాణ, ఇతర రంగాల కార్మికులు తమ పేర్లను తెలంగాణ బిల్డింగ్, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు వద్ద నమోదు చేసుకోవాలని తెలిపారు. అదే విధంగా ప్రభుత్వం అందించే బీమా పాలసీలను కూడా తీసుకోవాలన్నారు. బీమా పథకాలకు ప్రీమియం చెల్లించలేని స్థితిలో ఉంటే తన కార్యాలయానికి వస్తే వారి తరపున డబ్బు చెల్లిస్తామని ఆయన తెలిపారు.